News August 29, 2025
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41.50 అడుగులు

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 41.50 అడుగులకు చేరింది. దిగువ ప్రాంతానికి 8,68,724 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News August 29, 2025
మెదక్‌లో 8 మంది కామారెడ్డి విద్యార్థులకు పునరావాసం

కామారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు ఇటీవల మెదక్‌కు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షాల కారణంగా పోచారం డ్యామ్ పొంగిపొర్లడంతో పోచమ్మరాల్ వద్ద చిక్కుకుపోయారు. 2 రోజులుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులను గుర్తించిన రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులను హవేలీఘనాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర వసతి గృహానికి తరలించారు.
News August 29, 2025
జగిత్యాలలో గణేష్ చతుర్థికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

గణేష్ చతుర్థి వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జగిత్యాల పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. నిరంతర పర్యవేక్షణ, పికెటింగ్, మెరుగైన విజిబుల్ పోలీసింగ్‌తో భద్రతను ముమ్మరం చేశారు. పండుగ సజావుగా సాగేందుకు అన్ని ముందు జాగ్రత్తలు అమలులో ఉన్నాయి. శాంతి, సామరస్యంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు.
News August 29, 2025
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని 4వేల పోస్ట్ కార్డ్స్

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని దాదాపు 4 వేల పోస్ట్ కార్డ్స్‌ను జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు శుక్రవారం పోస్ట్ చేసారు. ఉదయం అన్నమయ్య అతిథి గృహం నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి జనరల్ పోస్ట్ మాస్టర్ హబీబుల్లాకు పోస్ట్ కార్డ్స్ వెంటనే మంత్రులకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో JAC కన్వీనర్ తరిగోపుల లక్ష్మీ నారాయణ, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు.