News August 31, 2025
భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం నిలకడగా ఉంది. నిన్నటివరకు వేగంగా పెరిగిన వరద ప్రవాహం, నేడు 47.7 అడుగులకు చేరుకుని స్థిరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News September 1, 2025
మద్నూర్: వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణం.!

డోంగ్లి మండలం సిర్పూర్‌కు చెందిన రాములు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు.. రాములు భార్య మాదాభాయ్, శంకర్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రాములు అడ్డు తొలగించుకోవడానికి వీరిద్దరూ కలిసి అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మాదాభాయ్, శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News September 1, 2025
NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.
News September 1, 2025
భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.