News July 5, 2025

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

Similar News

News July 5, 2025

ములుగు: నవోదయ ప్రవేశ పరీక్ష కరపత్రం ఆవిష్కరణ

image

నవోదయ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కరపత్రాన్ని ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, నవోదయ ప్రిన్సిపల్ పూర్ణిమ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు www.navodaya.gov.in వెబ్సైట్‌లో ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

News July 5, 2025

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు క‌లెక్ట‌ర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

News July 5, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

image

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.