News July 19, 2024

భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన గోదావరి

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News August 26, 2025

ప్రియాంకా గాంధీని కలిసిన ఖమ్మం ముఖ్య నేతలు

image

బిహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా AICC అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న యాత్రకు తమ మద్దతు తెలిపారు.

News August 26, 2025

ఖమ్మం: ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ప్రభుత్వ, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల యాజమాన్యాల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. హెచ్ఎంలకు 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులకు 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 28 లోగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ధ్రువీకరించి అందజేయాలని సూచించారు.

News August 26, 2025

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం: DMHO

image

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని DMHO డా. బి. కళావతి బాయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.