News April 4, 2025
భద్రాచలం వెళ్తుండగా.. కాలు నుజ్జునుజ్జయింది..!

అశ్వారావుపేట మండలం అసుపాక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాగల్లు ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. అలసటగా ఉండి భద్రాచలం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంజు అనే యువతికి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News April 8, 2025
అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్

AP: గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా గంజాయి లేదా డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తు అధికారం ఈ పీఎస్ పరిధిలో ఉంటుందని అందులో పేర్కొంది. స్టేషన్ హెడ్‌గా డీఎస్పీ స్థాయి అధికారి ఉండనున్నారు.
News April 8, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
News April 8, 2025
IPL: ఈరోజు రెండు మ్యాచ్‌లు

IPLలో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో KKR, LSG తలపడనుండగా రాత్రి 7.30 గంటలకు ముల్లాన్‌పూర్‌లో PBKS, CSK బరిలోకి దిగనున్నాయి. LSG, KKR రెండూ విజయాల బాటలోనే ఉండటంతో ఆ మ్యాచ్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో మ్యాచ్‌లో చెన్నై ఈరోజైనా గెలుస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. ఈ మ్యాచుల్లో ఎవరు గెలవచ్చు? కామెంట్స్‌లో చెప్పండి.