News December 12, 2025
భద్రాచలం సర్పంచ్‌గా పూనం కృష్ణ దొర విజయం

భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూనం కృష్ణ దొర ఘన విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో సమీప అభ్యర్థిపై ఆయన 1400 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు. కృష్ణ దొర విజయంపై అటవీ కార్పొరేషన్ ఛైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ప్రజల పక్షాన పోరాడేందుకు మరింత శక్తినిచ్చిందని కృష్ణ దొర పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. అత్యల్పంగా నేరెళ్లలో 8.6℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు రాఘవపేటలో 9.1, గుల్లకోట 9.3, తిరుమలాపూర్ 9.4, మన్నెగూడెం 9.4, పూడూర్ 9.4, జగ్గసాగర్ 9.6, కథలాపూర్ 9.6, రాయికల్ 9.7, అయిలాపూర్ 9.7, వెల్గటూర్ 9.7, మల్యాల 9.8, పెగడపల్లి 9.8, కోరుట్ల 9.9, సారంగాపూర్ 9.9, గొల్లపల్లె 9.9, గోవిందారం 9.9, మద్దుట్ల 10.0, బుద్దేశ్‌పల్లిలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News December 12, 2025
‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్‌ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది.
News December 12, 2025
శ్రీకాకుళం జిల్లాలో తెరుచుకోని అంగన్వాడీ కేంద్రాలు

శ్రీకాకుళం జిల్లాలోని 3,385 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం తెరుచుకోలేదు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రధానంగా కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, FRS రద్దు తదితర ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నాలో పాల్గొనున్నారు.


