News August 14, 2025

భద్రాచలం: సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణం

image

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. సుప్రభాతం, తోమాల సేవ అనంతరం స్వామివారి, అమ్మవారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, మంగళహారతులతో భక్తిపూర్వకంగా మారింది.

Similar News

News August 16, 2025

రూ.100 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’ మూవీ రెండో రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘Sacnilk’ ప్రకారం తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. నిన్న మూవీకి రూ.56.35 కోట్లు రాగా తొలిరోజు రూ.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఈ మూవీ రూ.108.35 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.

News August 16, 2025

HYD: డిప్లమా ఇన్ మ్యాజిక్.. దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు 90597 94553 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News August 16, 2025

ఉప్పునుంతలలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటలలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 15.2, బిజినేపల్లిలో 12.8, ఊరుకొండలో 12.6, కల్వకుర్తిలో 10.4, లింగాలలో 8.6, అచ్చంపేటలో 8.2, వెల్దండలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.