News April 5, 2025
భద్రాచలానికి పాదయాత్రగా వచ్చిన 7వేల మంది భక్తులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకున్నారు. ఉగాది నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శనివారం భద్రాచలం చేరుకున్నట్లు వారు తెలిపారు. ప్రతీ ఏటా శ్రీరామనవమికి పాదయాత్రగా వస్తామని చెబుతున్నారు.
Similar News
News April 6, 2025
ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News April 6, 2025
చెన్నై చెత్త రికార్డు

IPL: చెన్నై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో 5 నెమ్మదైన హాఫ్ సెంచరీల్లో 3 CSK ఆటగాళ్లవే కావడం గమనార్హం. విజయ్ శంకర్ 43, రచిన్ 42, జైస్వాల్ 40, లివింగ్‌స్టోన్ 39, గైక్వాడ్ 37 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. అటు నిన్న ధోనీ క్రీజులోకి వచ్చిన 19 బంతుల తర్వాత బౌండరీ బాదారు. మ్యాచులు ఓడిపోవడం సహజం అని, అయితే చెన్నై బ్యాటర్లలో గెలవాలన్న కసి కనిపించట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News April 6, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. మార్కెట్లకు పరిగెడుతున్న అమెరికన్లు

ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో అన్ని వస్తువులపై రేట్లు పెరుగుతాయన్న ఆందోళన అమెరికావ్యాప్తంగా నెలకొంది. దీంతో జనాలు సూపర్ మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ దుకాణాల వరకూ పోటెత్తుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, బూట్లు, కార్లు, విదేశీ ఆహారాలు, విద్యుత్ పరికరాలు.. ఇలా అన్ని రకాల వస్తువులకూ భారీ డిమాండ్ నెలకొంది. ఏ షాపింగ్ మాల్ చూసినా జనం భారీగా కనిపిస్తున్నారు.