News April 6, 2025
భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.
Similar News
News April 7, 2025
IPL: నేడు ముంబైతో ఆర్సీబీ ఢీ

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడేలో ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. ముంబైకి రోహిత్, బుమ్రా ఇద్దరూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జట్టు బలం పుంజుకోనుంది. అటు ఆర్సీబీలో బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో సమష్టిగా విజయాలు సాధిస్తోంది. రెండూ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు గెలుపెవరిదో చూడాలి.
News April 7, 2025
ALERT: ఆ జిల్లాల వారు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో భానుడు భగభగలు పుట్టిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్కును దాటింది. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఎండలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News April 7, 2025
రేపు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్

TG: గుజరాత్‌లో రేపు, ఎల్లుండి జరిగే ఏఐసీసీ సమావేశాలకోసం సీఎం రేవంత్ రేపు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, పలువురు కీలక నేతలు ఈరోజు సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44మంది నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని సమాచారం.