News August 5, 2025
భద్రాద్రిలో దారుణం.. యువకుడి సజీవ దహనం

భద్రాద్రి(D) గుండాల మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. వెన్నెలబైలుకు చెందిన పర్సిక రాజు (35) తన బైకుపై తన పొలం వద్దకు వెళ్తుండగా, బైక్‌కు హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. దీంతో బైకుకు మంటలు చెలరేగి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Similar News
News August 6, 2025
ప్రతిభ కనబరిస్తే తప్పక ప్రోత్సాహం: ఖమ్మం CP

ఉత్సాహంతో పనిచేసే పోలీస్ సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కష్టపడి పనిచేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్కే. ఖాసీం అలీ, వి.గోపి, ఎం.సతీష్‌ను సీపీ అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం తప్పక ప్రోత్సాహం అందిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.
News August 6, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

జిల్లాలో పెండింగ్ ఉన్న 1,132 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 260 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్దిదారులకు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. 217 ఇండ్ల పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
News August 5, 2025
విద్యార్థుల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్
సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల ప్రిన్సిపల్, హెచ్ఎం, వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్లూరు ఎస్టీ బాలికల హాస్టల్‌లో జరిగిన పరిణామాలు హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.