News December 19, 2025
భద్రాద్రిలో 461 పంచాయతీలు ఎస్టీలకే..!

జిల్లాలో మొత్తం 471 పంచాయతీలు ఉండగా.. షెడ్యూల్డ్ ఏరియా కారణంగా 460 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలోనూ ఓ ST అభ్యర్థి విజయం సాధించడంతో వారి సంఖ్య 461కి చేరింది. రిజర్వేషన్లు లేని మిగిలిన 11స్థానాల్లో జనరల్ కింద 9, ఎస్సీలకు 2 కేటాయించారు. జనరల్ స్థానాల్లో ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, నలుగురు ఓసీ అభ్యర్థులు గెలుపొందగా.. రిజర్వ్ చేసిన రెండు చోట్లా ఎస్సీ అభ్యర్థులే విజయం సాధించారు.
Similar News
News December 21, 2025
అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

శబరిమల నుంచి HYD వస్తున్న అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. కడప(D) గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఆ లారీని ఢీకొట్టకపోయుంటే బస్సు లోయలో పడే అవకాశముండేదని, అదే జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగుండేదని భక్తులు వాపోయారు.
News December 21, 2025
ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం పెను ప్రమాదం తప్పింది. శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు లోయల పడే అవకాశం ఉండేదనీ, ఒకవేళ ఇదే జరిగింటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని యాత్రికులు వాపోయారు.
News December 21, 2025
తిమ్మాపూర్: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

ఎల్ఎండి కాలనీలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణకు ధరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఈనెల 30న ప్రారంభిస్తామని, శిక్షణ కాలం 31 రోజులని, శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయాలంటాయని చెప్పారు. 18 -45 ఏళ్ల పదోతరగతి చదివిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు.


