News February 23, 2026

భద్రాద్రి: అడవిలో పులి సంచారం.. యంత్రాంగంలో అస్పష్టత

image

కిన్నెరసాని అటవీ ప్రాంతంలో తల్లి,పిల్ల పులుల పాదముద్రలను అధికారులు గుర్తించినప్పటికీ, అవి ఎటు వెళ్లాయనే అంశంపై స్పష్టత కరవైంది. పులి కొమరారం వైపు వెళ్లిందని స్థానికులు,ఏటూరునాగారం అడవుల్లోకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే పులి జాడ గుర్తిస్తామని అటవీ అధికారి బాబు తెలిపారు.

Similar News

News March 2, 2026

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్

image

AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు.

News March 2, 2026

వనపర్తి: సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేయండి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలలను జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News March 2, 2026

అరామ్‌కోపై ఇరాన్ దాడి.. ప్రభావమెంత?

image

సౌదీ <<19278592>>అరామ్‌కో<<>>కు చెందిన రాస్ తనూరా రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి, ఎగుమతి కేంద్రం. ఇక్కడ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. 3.3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేసే వసతులు ఉన్నాయి. అత్యాధునిక లోడింగ్ బెర్తులు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో కూడిన ఈ పోర్ట్ ద్వారా గ్లోబల్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు 7% ఎగుమతులు జరుగుతాయి. దీంతో ఆయిల్ ధరలు భారీగా పెరిగే ఆస్కారముంది.