News October 21, 2025
భద్రాద్రి: ఆ విషాదానికి 28 ఏళ్లు..ఎప్పటికీ మర్చిపోలేం

కరకగూడెం ఠాణాపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పినపాక(M) పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997 జనవరి 9న అర్ధరాత్రి సుమారు 100 మంది మావోయిస్టులు కరకగూడెం ఠాణాపై దాడికి పాల్పడి, స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా, పోలీసులు ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు.
Similar News
News October 21, 2025
అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత

అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ(29) కన్నుమూశారు. ‘టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారు’ అని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు.
News October 21, 2025
NZB: ముగిసిన రియాజ్ అంత్యక్రియలు

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం ముగిశాయి. బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో ముస్లిం సంప్రదాయ ప్రకారం ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు.
News October 21, 2025
గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ

UP వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్‌ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.