News March 22, 2025
భద్రాద్రి: ఇంకుడుగుంతలతో.. నీటిని ఒడిసిపడుదాం!

నీరు మానవాళి ఆరోగ్యానికి శ్రేయస్కరం. కానీ బాధ్యతారాహిత్యంతో దుర్వినియోగమవుతుండగా, మార్చి 22న జల దినోత్సవం నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో భద్రాద్రి జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, మినీ వాటర్ హోల్స్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అలాగే చెరువులు, కుంటలనూ పునరుద్ధరించాలి. నీటి వృథాపై పిల్లలకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తు అవసరాలకు ఢోకా లేనట్లే.
Similar News
News March 22, 2025
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

వ్యవసాయం, మత్స్య సంపద ఉత్పత్తుల విస్తీర్ణంతో ఆదాయం వృద్ధి అయ్యే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 10.70శాతం లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు.
News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఉగాది పురస్కారాలు వీరికే..

గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేయనుంది. వారిలో తాడేపల్లి సీఐడీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మహోన్నత సేవా పతకం అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సేవా పురస్కారానికి హెడ్ కానిస్టేబుల్ పిచ్చయ్య, APSP 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ARSI ఉదయ కుమార్, PCలు శివప్రసాద్, విరుపాక్ష ఎంపికయ్యారు. తెనాలి ఎస్ఐ శ్రీనివాసరావుకు సేవా పురస్కారం వరించింది.
News March 22, 2025
రాష్ట్రంలో పవర్ కట్స్.. KTR ఫైర్

తెలంగాణలో నెలకొన్న పవర్ కట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పదోతరగతి పరీక్షల సమయంలో పవర్ కట్ వల్ల ఓ విద్యార్థి ఎదుర్కొన్న సమస్యను కేటీఆర్ దృష్టికి ఓ తండ్రి తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలు పవర్ కట్ ఉండటంతో మొబైల్ టార్చ్ ద్వారా, కారులో లైట్ వేసుకొని చదువుకున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్- కరెంట్ ఓ చోట ఉండలేవని కేటీఆర్ విమర్శించారు.