News April 13, 2026

భద్రాద్రి: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 63.49%, ద్వితీయ సంవత్సరంలో 77.71% ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్‌ విభాగంలో 78.19% ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 13, 2026

ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 63 వినతులు అందగా, వాటిపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోషణ్ పక్వాడా, పీఎం ఇంటర్న్‌షిప్ పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు.

News April 13, 2026

బెంగాల్ ‘SIR’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

image

ఎన్నికల ఒత్తిడిలో ఓటర్ల హక్కును కాలరాయొద్దని, పుట్టిన దేశంలో ఓటరుగా కొనసాగే హక్కు రాజ్యాంగబద్ధమని CJI సూర్యకాంత్ బెంచ్ పేర్కొంది. బెంగాల్‌ ‘SIR’లో ఓట్లు కోల్పోయిన వారి పిటిషన్లను విచారిస్తూ.. అప్పీళ్లను పరిష్కరించేందుకు పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలంది. ఏప్రిల్ 23, 29న జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఓటరు తుది జాబితాకు గడువు ముగిసినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని వ్యాఖ్యానించింది.

News April 13, 2026

ప్రతి దరఖాస్తును తక్షణమే పరిష్కరించాలి: నిర్మల్ కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అత్యధికంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.