News October 15, 2025
భద్రాద్రి: ఈనెల 16న చుంచుపల్లి లో జాబ్ మేళా.!

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు. చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మెరీనా పెయింట్స్ కంపెనీలో 27 విభాగాలలో 2190 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 24 ఏళ్ల నుంచి 43 ఏళ్ల వారు, 10, ANY డిగ్రీ, ITI, B.Tech, ANM, GNM అర్హత కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.
Similar News
News October 15, 2025
అనకాపల్లి: ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యం గుర్తింపు’

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చునని అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ మంగళవారం తెలిపారు. షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం సమాచారం వస్తుందన్నారు. సమాచారం రాకపోతే కల్తీ మద్యంగా గుర్తించాలన్నారు. బీరు బాటిల్ స్కాన్ చేస్తే ఎటువంటి సమాచారం రాదన్నారు. మద్యం బాటిల్ స్కాన్ చేయడానికే ఇది ఉపయోగపడుతుందన్నారు.
News October 15, 2025
నగరిలో దారుణ హత్య

రూ.1.25 కోట్ల నగదు కోసం గుణశీలన్(65)ను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు చేసి చెరువులో పడేశారు. నగరి పట్టణం కొత్తపేటకు చెందిన గుణశీలన్‌కు విజయ్‌తోపాటు ముగ్గురు సంతానం. విజయ్‌కు అదేఊరిలోని గంగాధరం కూతరు కౌలస్యతో పెళ్లి జరిగింది. కుటుంబ సమస్యలతో 6 నెలలకే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు మీద వచ్చిన రూ1.25 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం గంగాధరంతోపాటు మరోవ్యక్తి గుణశీలన్ను హత్య చేసినట్లు పోలీసులుతెలిపారు.
News October 15, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 332.53 మీటర్లు (80.5 టీఎంసీలు)గా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 22,290 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 4 గేట్లు తెరిచి సమానంగా 22,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి, కాకతీయ, లక్ష్మీ కాల్వల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.