News March 11, 2025

భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News March 11, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

image

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.

News March 11, 2025

మెదక్: ‘నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ’

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్‌లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News March 11, 2025

అనుమానాస్పద స్థితిలో కొరియన్ సింగర్ మృతి

image

దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్‌లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండె‌పోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్‌సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.

error: Content is protected !!