News January 14, 2026

భద్రాద్రి: ఏ పార్టీతో దోస్తీ.. ఏ పార్టీతో కుస్తీ..!

image

భద్రాద్రి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో దోస్తీ, ఏ పార్టీతో కుస్తీ పడతారో క్లారిటీ రాలేదు. కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కటీఫ్ అయిందని BRSతో పొత్తుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మేం పోటీలో ఉంటామని బీజేపీ, జనసేన నాయకులు ప్రకటించారు. పొలిటికల్ దోస్తీపై మీ కామెంట్..?

Similar News

News February 21, 2026

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

image

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

బాన్సువాడ అల్లర్లు.. 12 మంది ARREST

image

బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ హెచ్చరించారు.

News February 21, 2026

గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

image

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.