News December 17, 2025

భద్రాద్రి: ‘ఒక్క’ ఓటుతో వరించిన సర్పంచి పీఠం

image

జూలూరుపాడు మండలం నలబండబొడు ఎన్నికల ఫలితం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. ఇక్కడ BRS మద్దతుదారు గడిగ సింధు కేవలం ఒక్క ఓటు మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి బచ్చల ఝాన్సీరాణిపై విజయం సాధించారు. ఆ గ్రామపంచాయతీలో మొత్తం 144 ఓట్లు కాగా నేటి పోలింగ్‌లో 139 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థినికి 69 ఓటు రాగా 70 ఓట్లు సింధూకి పోలయ్యాయి. ఒకే ఒక్క ఓటుతో సింధు గెలవడంతో BRS శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

Similar News

News December 22, 2025

విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

image

TG: విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు Dy.CM భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

News December 22, 2025

పాలన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలు ముగిసినందున పాలన వ్యవహారాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబద్దతతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మండల ప్రత్యేక అధికారులుగా కీలకపాత్ర పోషించిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

News December 22, 2025

అనంతపురం: ఉద్యోగాలను సొంతం చేసుకోండి..!

image

అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు 10th ఆపై చదివి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నారు.