News December 13, 2025
భద్రాద్రి: ఓకే కుటుంబం నుంచి నలుగురు

పినపాక మండలంలోని సీతంపేట పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ పోతినేని శివశంకర్ 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. శివశంకర్ తండ్రి ఇస్తారి, తల్లి జయమ్మ, పిన్ని సావిత్రమ్మలు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబం నుంచి నలుగురు విజయం సాధించి, పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
Similar News
News December 17, 2025
పంచాయతీ పోరు: పాన్‌గల్‌లో జోరు.. వీపనగండ్లలో నెమ్మది

వనపర్తి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 56.7 శాతం పోలింగ్ నమోదు కాగా, వీపనగండ్లలో అత్యల్పంగా 52.4 శాతం నమోదైంది. పెబ్బేరు(55.6%), శ్రీరంగాపూర్(54.9%), చిన్నంబావి(54%)ల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు మండలాల్లోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్‌లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.
News December 17, 2025
నెల్లూరు: డ్రోన్స్ తిరుగుతున్నాయ్ తస్మాత్ జాగ్రత్త!

నెల్లూరు నగరం, చుట్టు పక్కల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్స్ తిరుగుతున్నాయి. వాటి పని ఏమిటంటే మారుమూల ప్రాంతాల్లో, పాడుబడిన భవనాల్లో ఎక్కడెక్కడ ఆకతాయిలు తిరుగుతారో వారిని టార్గెట్ చేస్తాయి ఈ డ్రోన్లు. వారు ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. వారు పేకాట ఆడుతున్నారా.. మద్యం తాగుతున్నారా.. మరేమైనా చీకటి పనులు చేస్తున్నారా అనేది తెలిసిపోయి పోలీసులు దాడులు చేస్తారు.


