News November 18, 2025

భద్రాద్రి కలెక్టర్‌కు జాతీయ స్థాయి అవార్డు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందుకోనున్నారు. తెలంగాణలో ఎంపికైన ఆరు జిల్లాల్లో భద్రాద్రి ఒకటి.

Similar News

News November 18, 2025

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.