News March 25, 2025
భద్రాద్రి కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తండా వాసులు

దాసు తండా, రేగుల తండాలలో గత రెండేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని తండావాసులు మంగళవారం అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలో బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు బోడు వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని వాపోయారు.
Similar News
News March 26, 2025
భార్యాభర్తల మధ్య వివాదం.. రెండేళ్ల కూతురి మృతి

కుటుంబ కలహాలతో రెండేళ్ల కూతురితో కలిసి మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వత్సవాయి (మం) కన్నెవీడులో చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మనస్తాపనికి గురైన మహిళ బిడ్డతో ఇంటి నుంచి గ్రామ శివారులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల శ్రావణి మృతిచెందగా తల్లికి గాయాలయ్యాయి.
News March 26, 2025
IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్‌లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.
News March 26, 2025
HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.