News February 27, 2025

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.94% నమోదు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం4 గంటలకు ఎన్నికలు ముగిసే సమయానికి 91.94% ఓట్లు పోలైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2022 మంది ఓటర్లు ఉండగా 1859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

‘సిద్దిపేట సురక్ష నేత్ర’ను ప్రారంభించిన సీపీ

image

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన “సిద్దిపేట సురక్ష నేత్ర” సీసీటీవీ వ్యవస్థను సీపీ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. తొలి దశలో జిల్లావ్యాప్తంగా 200కు పైగా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నేరాల నివారణ, వేగవంతమైన విచారణతో పాటు ట్రాఫిక్ పర్యవేక్షణకు ఈ నిఘా నేత్రాలు కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.

News March 2, 2026

గంగవరం: పులి పాదముద్రలు గుర్తింపు- సబ్ డిఎఫ్ఓ

image

గంగవరం మండలం నల్లగొండ అటవీ ప్రాంతంలో సోమవారం పులి పాదముద్రలు గుర్తించామని అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. అక్కడ స్థానికంగా ఉన్న చెరువులో నీటిని తాగినట్లు గుర్తించామని చెప్పారు. పాద ముద్రలు గుర్తించి వాటి నమూనాలను పైస్థాయి అధికారులకు పంపించామని తెలిపారు. పులి విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు