News March 25, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి అవార్డు

ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సీఆర్పిఎఫ్ అధికారులు అభినందించారు. సోమవారం సీఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారుసిన్హా చేతుల మీదుగా డీజీ డిస్క్ ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందుకున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన సందర్భంగా అవార్డు లభించింది.
Similar News
News November 10, 2025
సింగపూర్ వెళ్లనున్న పాలకొండ టీచర్

రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తున్న పాలకొండ హైస్కూల్ సంస్కృత ఉపాధ్యాయుడు బి.శంకరరావును ప్రభుత్వం సింగపూర్ పంపిచనుంది. రాష్ర్టంలో మరికొందరు ఉపాధ్యాయులు, మంత్రి లోకేశ్‌తో పాటు అక్కడి ప్రముఖులతో పాఠశాలలో విద్యా విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈనెల 27న ప్రభుత్వం ఉపాధ్యాయులను సింగపూర్ పంపించనుంది. డిసెంబర్ వరకు ఉపాధ్యాయ బృందం ఢిల్లీలో పర్యటించనుంది.
News November 10, 2025
GWL: నూతన డీఎంహెచ్‌ఓగా సంధ్యా కిరణ్మయి

గద్వాల నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్ జే.సంధ్య కిరణ్మయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైద్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్పతో పాటు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేద్దామని పేర్కొన్నారు.
News November 10, 2025
గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


