News January 1, 2026
భద్రాద్రి కొత్తగూడెం: టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షాకేంద్రాల ఎంపిక, బందోబస్తు, విద్యుత్ సరఫరా అంశాలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనలకు విధులను కేటాయిస్తూ, అక్రమాలకు తావులేకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
Similar News
News January 1, 2026
సంగారెడ్డి: పదిలో మెరుగైన ఫలితాలను సాధించాలి: డీఈఓ

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రామ్ చందర్, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.
News January 1, 2026
496 వాహనదారులకు జరిమానాలు: ఎస్పీ నరసింహ

నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 140 మందిపై కేసులు నమోదు చేయగా, ట్రాఫిక్ నియమాలు పాటించని 496 వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
News January 1, 2026
అనాధలతో చిత్తూరు SP న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు అనాధలతో కలిసి ఎస్పీ తుషార్ డూడీ గురువారం నిర్వహించారు. చిత్తూరు తపోవణంలో అనాధ పిల్లలు, వృద్ధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పిల్లలకు కేక్, వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం పిల్లలతో ఆయన ముచ్చటించి వారి ఆశయాలపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చెప్పారు. వృద్ధులతో మాట్లాడుతూ.. అవసరమైన సమయాల్లో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని SP సూచించారు.


