News February 26, 2026
భద్రాద్రి కొత్త కలెక్టర్ అంకిత్ నేపథ్యం ఇదే..!

భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి అంకిత్ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ఆయన తాజా బదిలీలలో భాగంగా రానున్నారు. అంకిత్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. నిజామాబాద్‌లో పరిపాలనా వ్యవస్థలో అన్ని విభాగాల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News February 27, 2026
అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. <<19249664>>అఫ్గాన్ దాడుల<<>>కు ప్రతీకారంగా పాక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్ పేరిట ఏకంగా రాజధాని కాబూల్‌పైనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్‌లపైనా పాక్ సేన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News February 27, 2026
ఇవాళ పుట్టపర్తి రావొద్దు: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రతీ నెల 4వ శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని కోరారు.
News February 27, 2026
బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్‌కతాలో విండీస్‌తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


