News February 13, 2025

భద్రాద్రి: కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్

image

కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తికి మెజిస్ట్రేట్ కంభపు సూరి రెడ్డి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ వివరాలిలా.. 2023లో అశ్వాపురానికి చెందిన ముత్యంబోయిన వెంకటేశ్వర్లు అదే మండలానికి చెందిన సున్నం సత్యనారాయణకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టులో కేసు దాఖలు చేయగా, వాయిదాలకు రాకపోవడంతో రిమాండ్ విధించారు.

Similar News

News February 13, 2025

సిద్దిపేట: వ్యక్తి పై నుంచి వెళ్లిన కంటైనర్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వర్గల్ మండలం తునికి మక్తా గ్రామానికి చెందిన స్వామి(45)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

News February 13, 2025

అనంతగిరిలో చిరుత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

image

అనంతగిరి అడవిలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అనంతగిరిలో పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం చిరుత సంచరిస్తుందని అనుమానం ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ అరుణా తెలిపారు. ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని ఆమె సూచించారు. పులిసంచారం ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News February 13, 2025

పెద్దగట్టు జాతరకు సెలవు ప్రకటించాలని వినతి

image

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.

error: Content is protected !!