News April 5, 2025

భద్రాద్రి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం కర్నెగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కే.నరసింహారావు ఇంట్లో జరిగిన ఘర్షణలో గడ్డి మందు తాగినట్లు స్థానికులు చెప్పారు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ రతీశ్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News November 14, 2025

జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

image

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్‌కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News November 14, 2025

ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

image

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.

News November 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.