News March 9, 2025

భద్రాద్రి: గిరిజనుల వంట రుచి చూసిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

దుమ్ముగూడెం మండలం బొజ్జుగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. మహిళ అధికారులు, మహిళ సంఘాలు, విద్యార్థులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళ కళాబృందంచే నృత్య ప్రదర్శనలు, గిరిజన పండ్లు, పాలపండ్లు, రాగి జావ, జొన్న జావ, తేనే రుచి చూశారు.

Similar News

News September 19, 2025

తెర్లాం: తండ్రిని చంపిన కసాయి కొడుకు

image

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపాడు కసాయి కొడుకు. తెర్లాం (M) ఎంఆర్.అగ్రహారానికి చెందిన అప్పలస్వామికి ఇద్దరు కొడుకులు. తన గురించి ఊరంతా చెడుగా చెబుతున్నాడంటూ చిన్న కుమారుడు శంకరరావు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలోనే కోపంలో రాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని మనవరాలు కల్పన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 19, 2025

ప్రతిభ చూపితే చాలు ఏటా రూ.12వేలు!

image

ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థుల నుంచి NMMS పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా ₹12వేల సాయం లభిస్తుంది. దరఖాస్తులు ఈనెల 30లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. రీజనింగ్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో 3 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది అనంతపురం జిల్లాలో 4,200 మంది దరఖాస్తు చేయగా 210 మంది అర్హత సాధించారు.

News September 19, 2025

SRD: బంధువులను పరామర్శించేందుకు వెళ్తూ..

image

సంగారెడ్డిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ చనిపోయింది. సదాశివపేటకు చెందిన విజయలక్ష్మి(60), కూతురు- అల్లుడు అరుణ, ప్రతాప్‌తో కలిసి HYDలో బంధువులను పరామర్శించేందుకు బైక్‌పై వెళ్తున్నారు. పోతిరెడ్డిపల్లి సిగ్నల్ వద్ద బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో విజయలక్ష్మి స్పాట్‌లోనే చనిపోగా, గాయపడ్డ అరుణ, ప్రతాప్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.