News April 6, 2025

భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

image

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

Similar News

News April 7, 2025

NZB: ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

image

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.

News April 7, 2025

అమలాపురం: కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక

image

అమలాపురం టౌన్‌లోని కొంకాపల్లికి చెందిన 9 ఏళ్ల బాలిక కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలిక ఆదివారం ప్రైవేటుకు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు బలవంతంగా తీసుకెళ్తుండగా కలశం సెంటర్లో కారు ట్రాఫిక్‌లో చిక్కుకుండగా కిడ్నాపర్ చేతిని కొరికి తప్పించుకున్నట్లు ఫిర్యాదు చేశారని సీఐ వీరబాబు తెలిపారు.

News April 7, 2025

టారిఫ్స్.. బ్యూటిఫుల్ థింగ్: ట్రంప్

image

టారిఫ్స్ నిర్ణయం US భవిష్యత్తుకు ఎంతో కీలకమన్న విషయం ఏదో ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇలా స్పందించారు. ‘చైనా, ఈయూ సహా ఎన్నో దేశాలతో మనకు ఆర్థిక లోటు ఉంది. టారిఫ్స్ విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఈ నిర్ణయంతో $బిలియన్ల ఆదాయం వస్తుంది. జో బైడెన్ మిగిల్చిన లోటును అతిత్వరలో పూడ్చుతాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!