News January 31, 2025
భద్రాద్రి: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ.సుచరిత గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. కొత్తగూడెం జిల్లా రామవరంనకు చెందిన కంభంపాటి కోటేశ్వరరావు వద్ద, సన్యాసి బస్తీకి చెందిన కొడాలి నరసింహారావు రూ.5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు ఇచ్చాడు. ఆ అప్పును తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.
Similar News
News July 6, 2025
భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News July 6, 2025
LEAP యాప్‌లో పొందుపరచాలి: కలెక్టర్

ఈనెల 10న ఏలూరు జిల్లాలో జరిగే మెగా పేరెంట్స్ మీట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ‘LEAP యాప్’లో కార్యక్రమ వివరాలను పొందుపరచాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నివేదికలను అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యతిరేకత, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు.
News July 6, 2025
కోటపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.