News October 23, 2025
భద్రాద్రి: జాతీయ కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్‌లో జరిగే 69వ రాష్ట్రస్థాయి బాల, బాలికల పోటీలకు, జనవరిలో ఈ బయ్యారం ZPHSలో జరగనున్న జాతీయస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 23, 2025
వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్‌లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.
News October 23, 2025
రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
News October 23, 2025
మాడుగుల: కార్తీక మాసంలో పిక్నిక్ స్పాట్ ఇది!

మాడుగులకు 3కి.మీ దూరంలో ఉన్న శ్రీఉబ్బలింగేశ్వర ఆలయం కార్తీక మాసంలో మంచి పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. చుట్టు ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంది. కార్తీకమాసంలో ఎక్కువ మంది భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ వనభోజనాలు చేస్తుంటారు. ఈ ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఈశ్వరుని విగ్రహం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో సినిమా, సీరియల్స్ షూటింగులు జరిగాయి.