News April 6, 2025
భద్రాద్రి జిల్లాకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు చెప్పారు. అన్ని సహజ వనరులు మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు అందచేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 7, 2025
కోడేరు: మురుగు కాలువలో పడి యువకుడు మృతి

మూర్చ వ్యాధితో యువకుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందిన ఘటన కోడేరులో ఆదివారం ఉదయం చోటుచేసుకంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోడేరు క చెందిన మిద్దె మహేష్ (20) అనే యువకుడు గత కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి ప్రధాన రహదారి పక్కల ఉన్న మురుగు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.
News April 7, 2025
ASF: సోలార్ తీగలు తగిలి రైతులు మృతి

సొలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాంకి చెందిన నీకోరె బాపూజీ శనివారం రాత్రి తన అన్న ఎడ్లు ఇంటికి రాకపోవడంతో వెతకడానికి వెళ్లాడు. తెల్లారేసరికి ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాథోడ్ వివేక్ పొలం పక్కనున్న కెనాల్‌లో ఏర్పాటుచేసిన సొలార్ తీగలకు తగిలి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 7, 2025
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి నూటికి నూరుపాళ్లు నిజం. ఏ భయం లేకుండా ఏదైనా తినగలగడం, దాన్ని అరాయించుకోగలగడం, హాయిగా నిద్రపోవడం.. వీటి తర్వాతే మనిషికి ఏ ఆస్తైనా. బీపీలు, షుగర్లు, దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు.. ఒకటేమిటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు అనేక రకాల మహమ్మార్లు కాచుకుని ఉన్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నవారే అదృష్టవంతులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.