News October 8, 2025
భద్రాద్రి జిల్లాలో కృత్రిమ బీచ్ ఏర్పాటు..!

భద్రాద్రి జిల్లాలో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మణుగూరు మండలం పగిడేరులో వేడినీటి ఊటల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇక్కడ ఊబికి వచ్చే నీటిని రైతులు ఉపయోగించడం లేదు. మడుల్లో నిల్వ చేసి చల్లారాక పొలాలకు పారిస్తున్నారు. ఆ మడుల వద్ద ఇసుక రాశులను పోసి కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బీచ్ ఏర్పాటుకు సింగరేణి సహకారం అందించనుంది.
Similar News
News April 8, 2026
NLG: దేశస్థాయిలో 5-స్టార్ రేటింగ్ కైవసం

విద్యాబోధనలోనే కాదు.. పర్యావరణ పరిరక్షణలోనూ NLG కేంద్రీయ విద్యాలయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రకృతిని ప్రేమిస్తూ, వనరులను పొదుపుగా వాడుతున్న ఈ పాఠశాలకు 5-స్టార్ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో NLG కేవీకి ఈ స్థానం దక్కడం విశేషమని, ఇది ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని ప్రిన్సిపల్ తెలిపారు.
News April 8, 2026
సిద్దిపేట జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీ

సిద్దిపేట జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యూటేషన్ ప్రతిపాదికన బదిలీలు చేశారు. మూడేళ్లపాటు ఒకే స్థానంలో ఉన్న RI, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసి తక్షణమే కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
News April 8, 2026
ఈ యుద్ధంలో నిజంగా ఓడింది సామాన్యుడే!

సీజ్‌ఫైర్‌ను US, ఇరాన్ రెండూ తమ విజయంగా చెప్పుకొన్నాయి. లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకున్నాయి. కానీ 38 రోజుల ఈ యుద్ధంలో నిజంగా ఓడింది మాత్రం సామాన్యుడే. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. చాలా దేశాలు ఎకనామిక్ క్రైసిస్‌లో చిక్కుకున్నాయి. పరువు కోసం ఇరాన్, US గెలుపు పాటలు పాడుతున్నా.. ప్రపంచం మాత్రం ఆ భారాన్ని ఇంకా మోయాల్సిందే.


