News September 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓భద్రాద్రి DEOగా అడిషనల్ కలెక్టర్ విద్యా చందన
✓జూలూరుపాడు: 63 కేజీల గంజాయి పట్టివేత
✓చర్ల: నీటి సంపులో పడి ముగ్గురు కార్మికులు మృతి
✓ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ జితేశ్
✓చుంచుపల్లి: కారు ఆటో ఢీ.. పలువురికి గాయాలు
✓భద్రాద్రి జిల్లావ్యాప్తంగా కాళోజీ జయంతి వేడుకలు
✓ రోళ్ళపాడు పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
✓భద్రాచలంలో హెర్బల్ హాస్పటల్ సీజ్
Similar News
News April 13, 2026
అనకాపల్లి: నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ తేజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30- 1:30 గంటల వరకు నం.8688400499కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అనకాపల్లి, విశాఖ,అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 13, 2026
పెరిగిన క్రూడాయిల్ ధరలు!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 8.36% ఎగసి 103 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద కొనసాగుతున్నాయి. యురోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓ దశలో 18% పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు <<19635574>>నిలిపేస్తామని<<>> US హెచ్చరించడంతో క్రూడ్ ధరలు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.
News April 13, 2026
కోనసీమలో 2400 ఏళ్ల నాటి అద్భుతం.. ఏంటో తెలుసా?

కోనసీమలో బౌద్ధం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి అదుర్రు గ్రామమే నిదర్శనం. ఇక్కడి మహాస్థూపం సుమారు 2400 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది. మౌర్య చక్రవర్తి అశోకుని కుమార్తె సంఘమిత్ర.. శ్రీలంకకు వెళ్లే మార్గంలో ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఈ స్థూపానికి పునాది వేసింది. సాంచి, సార్నాథ్ తర్వాత ముఖ్యమైన స్థూపాలలో ఒకటిగా అదుర్రు గుర్తింపు పొందింది.


