News March 10, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ ఇసుక అక్రమ రవాణా.. చర్యలు తీసుకుంటాం: మణుగూరు MRO ✓ రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ✓ రేపు పినపాక, కరకగూడెంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పాయం ✓ పొదెం వీరయ్య, నాగ సీతారాములకు దక్కని ఎమ్మెల్సీ ✓ భద్రాద్రి: మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ ✓ కొత్తగూడెం: మొక్కల ప్రేమికుడు విశ్వామిత్రను అభినందించిన హైకోర్టు జడ్జి ✓ పినపాకలో తల్లికి తలకొరివి పెట్టిన కూతుళ్లు.
Similar News
News March 10, 2025
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
News March 10, 2025
లోక్ అదాలత్ ద్వారా 1,211 కేసులు పరిష్కరించాం: ఎస్పీ

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.
News March 10, 2025
వరంగల్‌లో విధులు సంతృప్తినిచ్చాయి: అంబర్ కిషోర్ ఝా

వరంగల్ కమిషనరేట్‌లో సీపీగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న అంబర్ కిషోర్ ఝాతోపాటు, సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్‌ను కమిషనరేట్ పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా సత్కరించారు.