News November 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు: మణుగూరు డీఎస్పీ
✓దమ్మపేట: కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
✓జిన్నింగ్ మిల్లులు యధాతధంగా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్
✓భద్రాచలం ఎమ్మెల్యేను నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
✓సుజాతనగర్ హైస్కూల్ టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం
✓బూర్గంపాడు – సారపాక రోడ్డుకు మరమ్మతులు
✓ములకలపల్లి: అడవి పందిని వేటాడిన వ్యక్తి అరెస్ట్
✓పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా
Similar News
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 5, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి పోస్టుకు ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని సౌత్ క్యాంపస్ చరిత్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. సంబంధిత విభాగంలో 55% ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 7న ఉదయం 11.30గం.లకు బిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలి.


