News December 24, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓తాసిల్దారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
✓నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
✓పినపాక: గోదావరిలో యువకుడి మృత దేహం లభ్యం
✓చర్ల: అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
✓కొత్తగూడెంలో ఘనంగా సింగరేణి డే వేడుకలు
✓పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం
✓పాల్వంచ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా కొత్తగూడెంలో నిరసన
✓కిన్నెరసాని రివర్ వాక్ చేపట్టిన కలెక్టర్

Similar News

News December 25, 2025

FLASH: నార్కట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఛిద్రమైన శరీరం..!

image

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లూనాపై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను ఒక చోటికి చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 25, 2025

శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

image

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.

News December 25, 2025

దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

image

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్‌లెట్‌లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.