News January 2, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✓ ఇల్లందు: పల్టీ కొట్టిన ట్రాలీ 15 మేకలు మృతి
✓ పాల్వంచ పెద్దమ్మతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం
✓ జిల్లాలో కుష్టు వ్యాధి సర్వే పూర్తి భద్రాద్రి DM&HO
✓ పినపాక: లేగ దూడలపై పిచ్చికుక్కల దాడి
✓ మణుగూరు: ‘వృథాగా ఉన్న భూములను పేదలకు పంచాలి’
✓ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

Similar News

News January 2, 2026

సంగారెడ్డి: ‘దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.లక్ష’

image

దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. 19-5-2025 తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన వారు http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News January 2, 2026

రంపచోడవరం: ‘రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి’

image

రంపచోడవరం మండలం దేవరాతిగూడెం గ్రామానికి చెందిన చోడి దుర్గాప్రసాద్ (25) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన అత్తగారి ఊరు అయిన గొడ్ల గూడెం గ్రామం నుంచి బైక్‌పై స్వగ్రామం వస్తుండగా సుద్దగూడెం గ్రామం వద్ద అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడని గ్రామస్థులు చెప్పారు. ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 2, 2026

సిగరెట్ ధరలు పెరిగితే స్మగ్లింగ్ పెరుగుతుంది: TII

image

సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం <<18730084>>పెంపు<<>> వల్ల స్మగ్లింగ్ మరింత పెరుగుతుందని టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ప్రస్తుతం ప్రతి 3 సిగరెట్లలో ఒకటి అక్రమంగా రవాణా అయిందేనని చెప్పింది. ‘ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై కేంద్రం రివ్యూ చేయాలి. లేదంటే రైతులు, MSMEలు, రిటైలర్లకు నష్టం కలుగుతుంది. అక్రమ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చినట్లే. డ్యూటీ పెంపును ఒకేసారి అమలు చేయొద్దు’ అని కోరింది.