News January 4, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం అటవీ అధికారులు
✓భద్రాచలం గోదావరికి కనుల పండుగగా నదీహారతి
✓జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు
✓ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్
✓పినపాక: అక్రమ ఇసుక నిలువలు సీజ్
✓బూర్గంపాడు: 9మంది కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓దమ్మపేట: మందలపల్లి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్
✓దమ్మపేట: మైనర్ బాలిక పై వేధింపులు పోక్సో కేసు నమోదు

Similar News

News February 6, 2026

రంగులు మారే శివలింగం.. ఎక్కడంటే?

image

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్‌లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్‌ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.

News February 6, 2026

నేడు సీఎం రాక.. ఆదోని జిల్లా డిమాండ్‌పై స్పందిస్తారా?

image

సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు <<19058283>>జిల్లాలో<<>> పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐదు నియోజకవర్గాలతో ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని స్థానికుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై గత మూడు నెలలుగా ఉద్యమాలు సాగుతున్నాయి. మరోవైపు ఎమ్మిగనూరును కూడా జిల్లా చేయాలని కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు డిమాండ్లపై సీఎం చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News February 6, 2026

అద్భుతం.. ఈ నెల 28న గ్రహాల పరేడ్

image

ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. బృహస్పతి(గురు), బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే దగ్గర కనిపించనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు, బుధుడు, శని గ్రహాలను పశ్చిమ దిశలో టెలిస్కోప్‌తో చూసే అవకాశం ఉంది. వీటికి సమీపంలోనే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడవచ్చు. ఇక బృహస్పతి చంద్రుడి సమీపంలో నేరుగా కనిపించనుంది.