News January 7, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✓అశ్వరావుపేట మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి: జిల్లా కార్యదర్శి
✓దమ్మపేట: ఆలయం పక్కన మద్యం దుకాణం తొలగించాలి: బీజేపీ
✓పంట వ్యర్ధాలతో బయోచార్ తయారీ: కలెక్టర్
✓ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు సమర్పించాలి: కలెక్టర్
✓కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: భద్రాద్రి ఎస్పీ
✓జూలూరుపాడు వైద్యశాలను తనిఖీ చేసిన DM&HO
✓చైనా మాంజా వాడొద్దు: భద్రాచలం ఏఎస్పీ
Similar News
News January 9, 2026
విజయవాడ: ముగిసిన దుర్గగుడి పవర్ కట్ వివాదం

విజయవాడ దుర్గగుడి పవర్ కట్ వివాదానికి మంత్రుల జోక్యంతో తెరపడింది. ఆలయానికి విద్యుత్ కోత వివాదంపై మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి దేవాదయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్, దేవదాయ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. భక్తుల సెంటిమెంటు అంశాల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని స్పష్టం చేశారు.
News January 9, 2026
రూ.425 కోట్లతో పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

పెనుకొండలోని ఘనగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండపై ₹425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 60 ఎకరాల్లో నిర్మించే ఈ కేంద్రంతో 4,035 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పెనుకొండకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్సుల్లో రూ.132, ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్సుల్లో రూ.89 పెంచుకోవచ్చని పేర్కొంది. లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని సూచించింది.


