News January 7, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై 27న తుది వాదనలు
✓ 9న అశ్వారావుపేటలో రైతు మేళా: కలెక్టర్
✓ చండ్రుగొండలో కుష్టు వ్యాధిపై అవగాహన
✓ జూలూరుపాడు: నాటు సారా కేసులో నలుగురు బైండోవర్
✓ వేసవి పంటలతో అధిక లాభాలు: జూలూరుపాడు ఏఈఓ
✓ ఈ బయ్యారంలో ఘనంగా క్రీడా పోటీలు ప్రారంభం
✓ బూర్గంపాడు: సారపాకలో కోతుల స్వైర విహారం
✓ టేకులపల్లిలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం

Similar News

News February 6, 2026

పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

image

బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. CI శ్రీను వివరాల ప్రకారం.. గద్వాల్ (D) ధరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను రాఘవేంద్ర అనే యువకుడు నమ్మించి 6 నెలల కిందట బెంగళూరుకు తీసుకెళ్లాడు. పలుమార్లు అత్యాచారం చేసి గర్భం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 6, 2026

కల్తీ నెయ్యి కేసు.. చిన్నప్పన్నకు బెయిల్

image

AP: కల్తీ నెయ్యి కేసు నిందితుడు చిన్నప్పన్నకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జ్‌షీట్ కూడా దాఖలైనందున పిటిషనర్‌ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో తనకు ఉన్న స్థిర, చరాస్తుల వివరాలతో ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలంది.

News February 6, 2026

మందస: వాసుదేవుని బ్రహ్మోత్సవాలు.. కార్యక్రమాలు ఇవే

image

మందస శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో శనివారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 7న ఆంజనేయస్వామి అభిషేకం, 8న వాసుదేవుని అభిషేకం, 9న శేషవహనసేవ, 10న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 11న స్వామివారి కళ్యాణం, 12న తెప్పోత్సవం, అస్వవాహనసేవ, 13న చక్రస్నానం, రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.