News January 12, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ దమ్మపేట: కారు ఢీకొని మహిళ మృతి
✓ పాల్వంచ: గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఓటరు జాబితా విడుదల
✓ భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా దేవి ప్రసన్న ప్రమాణం
✓ కొత్తగూడెం: పెండింగ్ వేతనాలు చెల్లించాలి: ఐఎఫ్టీయూ
✓ కొత్తగూడెం బీఆర్ఎస్‌లో వర్గాలు లేవు: ఎంపీ వద్దిరాజు
✓ జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతి వేడుకలు
Similar News
News February 8, 2026
‘ముస్తాబు’తో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమూల మార్పులతోనే ‘స్కూల్ ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. బెలగాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని, గేటు నుంచి తరగతి గదుల వరకు మార్గాన్ని అందమైన పూలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
News February 8, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలు!

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఫేక్ సర్వేలకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తమ పార్టీ గెలుస్తుందంటూ నకిలీ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ సర్వేలను, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
News February 8, 2026
పల్నాడులో వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం?

నరసరావుపేట పరిధిలోని పెద్ద తురకపాలెం గ్రామ సర్పంచ్ ఆరిఫ్ బాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఒక కేసులో సాక్షిగా ఉన్నందున, ప్రత్యర్థులు తనను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు ఆరోపించారు. స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారని, ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


