News January 19, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓భద్రాద్రి నుంచి వందేళ్ళ సభకు సీపీఐ శ్రేణులు
✓జిల్లాలో తూనికల శాఖ అధికారి తనిఖీలు
✓జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం
✓వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
✓పాల్వంచ పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదం ముగ్గురికి గాయాలు
✓కొత్తగూడెం: రామవరంలో రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
✓రేపు ఆళ్లపల్లి, పాల్వంచలో పవర్ కట్
✓ఐటీడీఏ భద్రాచలంలో రేపు గిరిజన దర్బార్
Similar News
News February 5, 2026
చెప్పుల్లేకుండా నడిస్తే లాభాలు తెలుసా?

షూ/చెప్పులు లేకుండా నేల (గడ్డి, ఇసుక, మట్టి)పై నడిస్తే ఒత్తిడి తగ్గుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. దీనినే గ్రౌండింగ్ (ఎర్తింగ్) అంటారు. కండరాలు యాక్టివ్‌గా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. నొప్పి, వాపులు తగ్గుతాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
News February 5, 2026
చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు

చిన్నగంజాం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు అలల్లో గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న చిన్నగంజాం MRO ప్రభాకర్ రావు, SI రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News February 5, 2026
విజయ ఆత్మహత్య కేసులో వీడని మిస్టరీ!

TG: చర్లపల్లిలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయారెడ్డి ఆత్మహత్య కేసు మిస్టరీగానే ఉంది. ఆమె వాట్సాప్ రికార్డ్స్‌లో ఎలాంటి అనుమానాస్పద అంశాల్లేవని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. ఆర్థిక ఇబ్బందులు లేవని, నెలకు రూ.లక్ష వరకు జీతం, అద్దెలు, దుబాయ్‌లో ఉండే భర్త జీతం కూడా ఆమె అకౌంట్‌కే వస్తుందని తెలుస్తోంది.


