News February 11, 2026

భద్రాద్రి జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి నోటిఫై చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వారావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంగణాల్లో రిసెప్షన్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు

Similar News

News April 11, 2026

కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన ఫులే: కలెక్టర్

image

మహాత్మా జ్యోతిరావు ఫులే కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషిచేసిన మహానీయుడని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. శనివారం పరవాడ మండలం తానాం బీసీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫులే జయంతిని నిర్వహించారు. తన భార్య సావిత్రిబాయి ఫులేతో కలిసి మహిళలు, అణగారిన వర్గాలకు విద్యను అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

News April 11, 2026

పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్.. వేదిక, పద్ధతి మారుతోంది!

image

నేటి కాలంలో పెళ్లి సంబంధాల వేట మారుతోంది. ముఖ్యంగా నగరాల్లోని యువత పాత పద్ధతులకు స్వస్తి పలికి.. కొత్త తరం మ్యాచ్ మేకింగ్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ చూసుకొని వారిని స్వయంగా కలిసి మాట్లాడేందుకు ప్రత్యేక ఈవెంట్స్, మీటప్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. నమ్మకం, గోప్యతతో పాటు వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ వేదికలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.

News April 11, 2026

ఫూలే సేవలు చిరస్మరణీయమం: జనగామ కలెక్టర్‌

image

జిల్లా కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం కోసం, విద్యారంగ విస్తరణకు ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.