News September 14, 2025
భద్రాద్రి జిల్లాలో లోక్ అదాలత్.. 4,576 కేసుల పరిష్కారం

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 4,576 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సివిల్ కేసులు 32, క్రిమినల్ కేసులు 2,023, బ్యాంకు కేసులు 278, ఇల్లందులో సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 363, పీఎల్‌సీ కేసుల 132, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,106, పీఎల్‌సీ కేసులు 74, మణుగూరులో క్రిమినల్ కేసులు 489, పీఎల్‌సీ కేసులు 67 పరిష్కారం అయ్యాయన్నారు.
.
Similar News
News September 14, 2025
HYDలో రేషన్‌కార్డులు కట్.. దేనికో తెలియక షాక్

HYDలో చాలా చోట్ల లబ్ధిదారులకు రేషన్‌కార్డు రద్దయ్యాయని లబోదిబోమంటున్నారు. రేషన్‌షాపుల దగ్గర కార్డ్ నం. ఎంటర్ చేసేవరకు తెలియడం లేదని, దీనిపై ఎలాంటి సమాచారం లేదని మండిపడుతున్నారు. IT చెల్లించకున్నా తమ తెల్లరేషన్‌కార్డు రద్దవ్వడంపై గందరగోళానికి గురవుతున్నారు. కాగా, ఆధార్, పాన్ ద్వారా ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్నుశాఖ పరిశీలించి అనర్హుల కార్డు ర్దదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు?

వాటర్ క్యాన్‌లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.