News December 30, 2025

భద్రాద్రి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో సరఫరా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటికే 38,500 ఎకరాల్లో మొక్కజొన్న, 8,750 ఎకరాల్లో వరి సాగైందని, ప్రస్తుతం వరి నాట్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News December 30, 2025

రామగుండం: 12.30AMలోపు వేడుకలు ముగించుకోవాలి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను 12:30AMలోపు ముగించుకోవాలని సీపీ అంబర్‌ కిషోర్‌ తెలిపారు. 10PM నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్టానికి లోబడి ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

News December 30, 2025

అల్లూరి: ‘నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు’

image

2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అల్లూరి జిల్లా పోలీసు శాఖ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల ప్రదర్శనలు, బాణసంచా, డ్రగ్స్ వినియోగం నిషేధమని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్, కారు రేసింగ్‌లు, అతివేగం నిషేధమన్నారు. డీజే సౌండ్‌పై పరిమితులు విధించామని తెలిపారు.

News December 30, 2025

హరీశ్ రావు ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్

image

TG: బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ <<18714031>>హరీశ్ రావు<<>> చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ ఖండించారు. ‘హరీశ్ రావు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పోరాడుతూనే ఉంది. ఇప్పటికే దానిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. అది జనవరి 5న విచారణకు రానుంది. కేంద్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా.. DPR కూడా సిద్ధం చేయకుండా APని అడ్డుకుంది’ అని తెలిపారు.