News October 15, 2025
భద్రాద్రి జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

భద్రాద్రి జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో 2,02,862 మెట్రిక్ టన్నుల సన్నరకం, 35,315 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉంటాయని చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నరకానికి అదనంగా రూ.500 ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.
News October 15, 2025
రేపు శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామం మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు రేపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ ప్రయాణాలు రేపు మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News October 15, 2025
గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.