News February 24, 2026
భద్రాద్రి జిల్లాలో 2 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం!

మహిళా సంఘాల్లోని సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేసింది. భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం, మణుగూరు మండలంలోని ఉడతనేని గుంపు గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంపిక చేసింది. ఒక్కో పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుంది
Similar News
News February 24, 2026
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: SP

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163BNSS (144) సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
News February 24, 2026
2 రోజులు తిరుపతి ఐజర్‌లో కార్యక్రమాలు

ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇస్తారు.
News February 24, 2026
‘సింహచలంలో దర్శనాలు, అన్నీ ఆర్జిత సేవలు రద్దు’

సింహాచలం దేవాలయంలో మార్చి 3 ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఆరోజు స్వామి వారికి చూర్ణోత్సవము జరిపించిన అనంతరం కొండపై నుంచి తెల్లవారుజామున 4 గంటలకు కొండదిగువ ఉద్యానవన మండపంలో డోలోత్సవము, వసంత్సోవము నిర్వహించనున్నారు. ఆరోజు గ్రస్తోదయ చంద్రగ్రహణం సందర్భంగా భక్తులకు దర్శనాలు, సుప్రభాత సేవతో సహా అన్నీ ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు.


