News February 21, 2025
భద్రాద్రి జిల్లాలో 36 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వసిద్ధం చేయాలని కలెక్టర్ జీతేవ్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 36 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు మొదటి సంవత్సరంలో 9,225 మంది, రెండో సంవత్సరంలో 10,003 మంది విద్యార్థులు హజరవుతారన్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుతాయన్నారు.
Similar News
News December 16, 2025
వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్, ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్‌కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <
News December 16, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.


